Job 9:1 అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను
Job 9:2 వాస్తవమే, ఆ సంగతి అంతేయని నేనెరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును?
Job 9:3 వాడు ఆయనతో వ్యాజ్యెమాడ గోరినయెడలవేయి ప్రశ్నలలో ఒక్కదానికైనను వాడు ఆయనకుఉత్తరమియ్యలేడు.
Job 9:4 ఆయన మహా వివేకి, అధిక బలసంపన్నుడుఆయనతో పోరాడ తెగించి హాని నొందనివాడెవడు?
Job 9:5 వాటికి తెలియకుండ పర్వతములను తీసివేయువాడు ఆయనేఉగ్రతకలిగి వాటిని బోర్లదోయువాడు ఆయనే
Job 9:6 భూమిని దాని స్థలములో నుండి కదలించువాడుఆయనేదాని స్తంభములు అదరచేయువాడు ఆయనే
Job 9:7 ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడుఆయన నక్షత్రములను మరుగుపరచును.
Job 9:8 ఆయన ఒక్కడే ఆకాశమండలమును విశాలపరచువాడుసముద్రతరంగములమీద ఆయన నడుచుచున్నాడు.
Job 9:9 ఆయన స్వాతి మృగశీర్షము కృత్తిక అనువాటిని దక్షిణనక్షత్రరాసులను చేసినవాడు.
Job 9:10 ఎవడును తెలిసికొనలేని మహత్తయిన కార్యములను లెక్కలేనన్ని అద్భుతక్రియలను ఆయన చేయుచున్నాడు.
Job 9:11 ఇదిగో ఆయన నా సమీపమున గడచిపోవుచున్నాడుగాని నేనాయనను కనుగొనలేనునా చేరువను పోవుచున్నాడు గాని ఆయన నాకు కనబడడు.
Job 9:12 ఆయన పట్టుకొనిపోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగతగినవాడెవడు?
Job 9:13 దేవుని కోపము చల్లారదురాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు.
Job 9:14 కావున ఆయనకు ప్రత్యుత్తరమిచ్చుటకు నేనెంతటివాడను? ఆయనతో వాదించుచు సరియైన మాటలు పలుకుటకు నేనేపాటివాడను?
Job 9:15 నేను నిర్దోషినై యుండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలనున్యాయకర్తయని1 నేనాయనను బతిమాలుకొనదగును.
Job 9:16 నేను మొఱ్ఱపెట్టినప్పుడు ఆయన నాకుత్తరమిచ్చిననుఆయన నా మాట ఆలకించెనని నేను నమ్మజాలను.
Job 9:17 ఆయన ఆలకింపక పెనుగాలిచేత నన్ను నలుగగొట్టు చున్నాడునిర్ణిమిత్తముగా నా గాయములను విస్తరింపజేయుచున్నాడు
Job 9:18 ఆయన నన్ను ఊపిరి తీయనియ్యడు చేదైనవాటిని నాకు తినిపించును.
Job 9:19 బలవంతుల శక్తినిగూర్చి వాదము కలుగగానేనే యున్నానని ఆయన యనునున్యాయవిధినిగూర్చి వాదము కలుగగాప్రతివాదిగానుండ తెగించువాడెవడని ఆయన యనును?
Job 9:20 నా వ్యాజ్యెము న్యాయమైనను నా మాటలు నామీద నేరము మోపునునేను యథార్థవంతుడనైనను దోషియని ఆయన నన్ను నిరూపించును.
Job 9:21 నేను యథార్థవంతుడనైనను నాయందు నాకిష్టములేదునేను నా ప్రాణము తృణీకరించుచున్నాను. ఏమి చేసినను ఒక్కటే.
Job 9:22 కావునయథార్థవంతులనేమి దుష్టులనేమి భేదములేకుండ ఆయన అందరిని నశింపజేయుచున్నాడని నేను వాదించుచున్నాను.
Job 9:23 సమూలధ్వంసము ఆకస్మికముగా కలిగి నాశనముచేయగానిర్దోషుల ఆపదను చూచి ఆయన హాస్యము చేయును.
Job 9:24 భూమి దుష్టులచేతికి అప్పగింపబడియున్నదివారి న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తింపలేకుండ ఆయన చేయును. ఆయన గాక ఇవి అన్నియు జరిగించువాడు మరిఎవడు?
Job 9:25 పరుగుమీద పోవువానికంటె నా దినములు త్వరగాగతించుచున్నవిక్షేమము లేకయే అవి గతించిపోవుచున్నవి.
Job 9:26 రెల్లుపడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవునుఎరమీదికి విసురున దిగు పక్షిరాజువలె అవి త్వరపడిపోవును.
Job 9:27 నా శ్రమను మరచిపోయెదననియుదుఃఖముఖుడనై యుండుట మాని సంతోషముగానుండెదననియు నేను అనుకొంటినా?
Job 9:28 నా సమస్త బాధలకు భయపడి వణకుచున్నానునీవు నన్ను నిర్దోషినిగా ఎంచవను సంగతి నేను నిశ్చ యముగా ఎరిగియున్నాను
Job 9:29 నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చెను గదా కాబట్టి నాకు ఈ వ్యర్థప్రయాసమేల?
Job 9:30 నేను హిమముతో నన్ను కడుగుకొనిననుసబ్బుతో నా చేతులు కడుగుకొనినను
Job 9:31 నీవు నన్ను గోతిలో ముంచెదవు అప్పుడు నేను నా స్వంతవస్త్రములకై అసహ్యుడనగుదును.
Job 9:32 ఆయన నావలె నరుడు కాడునేను ఆయనతో వ్యాజ్యెమాడజాలనుమేము కలిసి న్యాయవిమర్శకు పోలేము.
Job 9:33 మా యిద్దరిమీద చెయ్య ఉంచదగిన మధ్యవర్తి మాకులేడు.
Job 9:34 ఆయన తన దండమును నామీదనుండి తీసివేయవలెనునేను భ్రమసిపోకుండ ఆయన తన భయంకర మహాత్మ్యమును నాకు కనుపరచకుండవలెను.
Job 9:35 అప్పుడు ఆయనకు భయపడక నేను మాటలాడెదను, ఏలయనగా నేను అట్టివాడను కాననుకొను చున్నాను.

No comments:
Post a Comment