Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, September 26, 2013

యోబు35

Job 35:1  మరియు ఎలీహు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను 
Job 35:2  నేను పాపము చేసినయెడల నాకు కలిగిన లాభము కన్న నా నీతివలన నాకు కలిగిన లాభమేమి అది నీకు ప్రయోజనమేమి? అనినీవు చెప్పుచున్నావే? 
Job 35:3  ఇదే న్యాయమని నీకు తోచినదా? దేవుని నీతికన్న నీ నీతి యెక్కువని నీవనుకొను చున్నావా? 
Job 35:4  నీతోను నీతో కూడనున్న నీ సహవాసులతోను నేను వాదమాడెదను. 
Job 35:5  ఆకాశమువైపు నిదానించి చూడుము నీ కన్న ఉన్నతమైన ఆకాశ విశాలములవైపు చూడుము. 
Job 35:6  నీవు పాపముచేసినను ఆయనకు నీవేమైన చేసితివా? నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైన చేసితివా? 
Job 35:7  నీవు నీతిమంతుడవైనను ఆయనకు నీవేమైన ఇచ్చు చున్నావా?ఆయన నీచేత ఏమైనను తీసికొనునా? 
Job 35:8  నీవంటి మనుష్యునికే నీ చెడుతనపు ఫలము చెందును నరులకే నీ నీతి ఫలము చెందును. 
Job 35:9  అనేకులు బలాత్కారము చేయుటవలన జనులు కేకలు వేయుదురు బలవంతుల భుజబలమునకు భయపడి సహాయముకొరకై కేకలు వేయుదురు. 
Job 35:10  అయితేరాత్రియందు కీర్తనలు పాడుటకు ప్రేరే పించుచు 
Job 35:11  భూజంతువులకంటె మనకు ఎక్కువ బుద్ధినేర్పుచు ఆకాశపక్షులకంటె మనకు ఎక్కువ జ్ఞానము కలుగ జేయుచు నన్ను సృజించిన దేవుడు ఎక్కడ నున్నాడని అను కొనువారెవరును లేరు. 
Job 35:12  కాగా వారు దుష్టులైన మనుష్యుల గర్వమునుబట్టి మొఱ్ఱపెట్టుదురు గాని ఆయన ప్రత్యుత్తర మిచ్చుటలేదు. 
Job 35:13  నిశ్చయముగా దేవుడు నిరర్థకమైన మాటలు చెవిని బెట్టడు సర్వశక్తుడు వాటిని లక్ష్యపెట్టడు. 
Job 35:14  ఆయనను చూడలేనని నీవు చెప్పినను వ్యాజ్యెము ఆయనయెదుటనే యున్నది, ఆయన నిమిత్తము నీవు కనిపెట్టవలెను. 
Job 35:15  ఆయన కోపముతో దండింపక పోయినందునను నిశ్చయముగా దురహంకారమును ఆయన గుర్తింపక పోయినందునను 
Job 35:16  నిర్హేతుకముగా యోబు మాటలాడి యున్నాడు తెలివిలేకయే మాటలను విస్తరింపజేసియున్నాడు. 

No comments:

Post a Comment