Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, September 26, 2013

యోబు30

Job 30:1  ఇప్పుడైతే నాకన్న తక్కువ వయస్సుగలవారు నన్ను ఎగతాళి చేయుదురు. వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో నుండుటకు తగనివారని నేను తలంచియుంటిని. 
Job 30:2  వారి చేతుల బలము నా కేమి ప్రయోజనమగును? వారి పౌరుషము పోయినది. 
Job 30:3  దారిద్ర్యముచేతను క్షామముచేతను శుష్కించినవారై ఎడారిలో చాల దినములనుండి పాడై నిర్మానుష్య ముగానున్న యెడారిలో ఆహారముకొరకు వారు తిరుగులాడుదురు 
Job 30:4  వారు తుప్పలలోని తుత్తిచెట్లను పెరుకుదురు తంగేడువేళ్లు వారికి ఆహారమైయున్నవి. 
Job 30:5  వారు నరుల మధ్యనుండి తరిమివేయబడిన వారు దొంగను తరుముచు కేకలు వేయునట్లు మనుష్యులు వారిని తరుముచు కేకలు వేయుదురు. భయంకరమైన లోయలలోను 
Job 30:6  నేల సందులలోను బండల సందులలోను వారు కాపురముండవలసి వచ్చెను. 
Job 30:7  తుప్పలలో వారు ఓండ్ర పెట్టుదురు ముళ్లచెట్లక్రింద వారు కూడియుందురు. 
Job 30:8  వారు మోటువారికిని పేరు ప్రతిష్ఠతలు లేనివారికిని పుట్టినవారు వారు దేశములోనుండి తరుమబడినవారు. 
Job 30:9  అట్టివారు ఇప్పుడు నన్నుగూర్చి పదములు పాడుదురు నేను వారికి సామెతకు ఆస్పదముగా నున్నాను. 
Job 30:10  వారు నన్ను అసహ్యించుకొందురు నా యొద్ద నుండి దూరముగా పోవుదురు నన్ను చూచినప్పుడు ఉమ్మివేయక మానరు 
Job 30:11  ఆయన నా త్రాడు విప్పి నన్ను బాధించెను కావున వారు నాకు లోబడక కళ్లెము వదలించు కొందురు. 
Job 30:12  నా కుడిప్రక్కను అల్లరిమూక లేచును వారు నా కాళ్లను తొట్రిల్లచేయుదురు పట్టణమునకు ముట్టడిదిబ్బ వేసినట్లు తమ నాశన ప్రయత్నములను నామీద సాగింతురు. 
Job 30:13  వారు నిరాధారులైనను నా మార్గమును పాడుచేయుదురు నామీదికి వచ్చిన ఆపదను మరి యధికము కలుగ జేయుదురు 
Job 30:14  గొప్ప గండిగుండ జలప్రవాహము వచ్చునట్లు వారు వచ్చెదరు ఆ వినాశములో వారు కొట్టుకొనిపోవుదురు. 
Job 30:15  భీకరమైనవి నామీద పడెను గాలి కొట్టివేయునట్లు వారు నా ప్రభావమును కొట్టివేయుదురుమేఘమువలె నా క్షేమము గతించిపోయెను. 
Job 30:16  నా ఆత్మ నాలో కరిగిపోయి యున్నది ఆపద్దినములు నన్ను పట్టుకొనియున్నవి 
Job 30:17  రాత్రివేళను నా యెముకలు నాలో విరుగగొట్టబడు నట్లున్నవి నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు. 
Job 30:18  మహా రోగబలముచేత నా వస్త్రము నిరూపమగును మెడ చుట్టునుండు నా చొక్కాయివలె అది నన్ను ఇరికించుచున్నది. 
Job 30:19  ఆయన నన్ను బురదలోనికి త్రోసెను నేను ధూళియు బూడిదెయునైనట్లున్నాను. 
Job 30:20  నీకు మొఱ్ఱపెట్టుచున్నాను అయితే నీవు ప్రత్యుత్తర మేమియు నియ్యకున్నావు నేను నిలుచుండగా నీవు నన్ను తేరి చూచుచున్నావు. 
Job 30:21  నీవు మారిపోయి నాయెడల కఠినుడవైతివి నీ బాహుబలముచేత నన్ను హింసించుచున్నావు 
Job 30:22  గాలిచేత నన్ను లేవనెత్తి దానిమీద నన్ను కొట్టుకొని పోజేయుచున్నావు తుపానుచేత నన్ను హరించివేయుచున్నావు 
Job 30:23  మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన సంకేత సమాజమందిరమునకు నీవు నన్ను రప్పించెదవని నాకు తెలియును. 
Job 30:24  ఒకడు పడిపోవునెడల వాడు చెయ్యిచాపడా? ఆపదలో నున్నవాడు తప్పింపవలెనని మొఱ్ఱపెట్టడా? 
Job 30:25  బాధలోనున్నవారి నిమిత్తము నేను ఏడవలేదా?దరిద్రుల నిమిత్తము నేను దుఖింపలేదా? 
Job 30:26  నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించెను వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగెను. 
Job 30:27  నా పేగులు మానక మండుచున్నవి అపాయదినములు నన్నెదుర్కొనెను. 
Job 30:28  సూర్యుని ప్రకాశములేక వ్యాకులపడుచు నేను సంచరించుచున్నాను సమాజములో నిలువబడి మొఱ్ఱపెట్టుచున్నాను. 
Job 30:29  నేను నక్కలకు సోదరుడనైతిని నిప్పుకోళ్ల జతకాడనైతిని. 
Job 30:30  నా చర్మము నల్లబడి నామీదనుండి ఊడిపోవుచున్నది కాకవలన నా యెముకలు కాగిపోయెను. 
Job 30:31  నా స్వరమండలము దుఃఖ స్వరము నిచ్చుచున్నది నా పిల్లనగ్రోవి రోదనశబ్దము ఎత్తుచున్నది. 

No comments:

Post a Comment