Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, September 26, 2013

యోబు31

Job 31:1  నేను నా కన్నులతో నిబంధన చేసికొంటిని కన్యకను నేనేలాగు చూచుదును? 
Job 31:2  ఆలాగు చేసినయెడల పరముననున్న దేవుని ఆజ్ఞ యేమగును?ఉన్నతస్థలముననున్న సర్వశక్తుని స్వాస్థ్యమేమగును? 
Job 31:3  దుర్మార్గులకు విపత్తు సంభవించుటే గదా పాపము చేయువారికి దురవస్థ ప్రాప్తించుటయే గదా. 
Job 31:4  ఆయన నా ప్రవర్తన నెరుగుమ గదా నా అడుగుజాడలనన్నిటిని లెక్కించును గదా 
Job 31:5  అబద్ధికుడనై నేను తిరుగులాడినయెడల మోసముచేయుటకై నా కాలు త్వరపడినయెడల 
Job 31:6  నేను యథార్థుడనై యున్నానని దేవుడు తెలిసి కొనునట్లు 
Job 31:7  న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక. నేను త్రోవవిడిచి నడచినయెడల నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించినయెడల మాలిన్యమేమైనను నా చేతులకు తగిలినయెడల 
Job 31:8  నేను విత్తినదానిని వేరొకడు భుజించును గాక నేను నాటినది పెరికివేయబడును గాక. 
Job 31:9  నేను హృదయమున పరస్త్రీని మోహించినయెడల నా పొరుగువాని ద్వారమున నేను పొంచియున్న యెడల 
Job 31:10  నా భార్య వేరొకని తిరుగలి విసరును గాక ఇతరులు ఆమెను కూడుదురు గాక. 
Job 31:11  అది దుష్కామకార్యము అది న్యాయాధిపతులచేత శిక్ష నొందతగిన నేరము 
Job 31:12  అది నాశనకూపమువరకు దహించు అగ్నిహోత్రము అది నా ఆదాయమంతయు నిర్మూలము చేయును. 
Job 31:13  నా పనివాడైనను పనికత్తెయైనను నాతో వ్యాజ్యె మాడగా నేను వారి వ్యాజ్యెమును నిర్లక్ష్యము చేసినయెడల 
Job 31:14  దేవుడు లేచునప్పుడు నేనేమి చేయుదును? ఆయన విచారణ చేయునప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమిత్తును? 
Job 31:15  గర్భమున నన్ను పుట్టించినవాడు వారినికూడ పుట్టింప లేదా? గర్భములో మమ్ము రూపించినవాడు ఒక్కడే గదా. 
Job 31:16  బీదలు ఇచ్ఛయించినదానిని నేను బిగబట్టినయెడలను విధవరాండ్రకన్నులు క్షీణింపజేసినయెడలను 
Job 31:17  తలిదండ్రులు లేనివారిని నా అన్నములో కొంచె మైనను తిననియ్యక నేను ఒంటరిగా భోజనము చేసినయెడలను 
Job 31:18  ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను 
Job 31:19  వారి దేహములు నన్ను దీవింపకపోయినయెడలను వారు నా గొఱ్ఱలబొచ్చుచేత వేడిమి పొందకపోయిన యెడలను 
Job 31:20  గుమ్మములో నాకు సహాయము దొరకునని తండ్రిలేనివారిని నేను అన్యాయము చేసినయెడలను 
Job 31:21  నా భుజశల్యము దాని గూటినుండి పడును గాక నా బాహువు ఎముకలోనికి విరుగును గాక. 
Job 31:22  నేనాలాగు చేయలేదు, నా బాల్యము మొదలుకొని దిక్కు లేనివాడు తండ్రిభావముతో నన్ను భావించి నాయొద్ద పెరిగెను. నా తల్లి గర్భమందు పుట్టిననాటనుండి దిక్కు లేని వానికి నేను మార్గదర్శినైతిని. 
Job 31:23  దేవుని మహాత్మ్యము ఎదుట నేను నిలువజాలననియు ఆయన నన్ను నిర్మూలము చేయుననియు భీతిపుట్టెను. 
Job 31:24  సువర్ణము నాకు ఆధారమనుకొనినయెడలను నా ఆశ్రయము నీవేయని మేలిమి బంగారముతో నేను చెప్పినయెడలను 
Job 31:25  నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారము సొత్తు దొరికెనని గాని నేను సంతోషించిన యెడలను 
Job 31:26  సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినేగాని చంద్రుడు మిక్కిలి కాంతికలిగి నడచుచుండగా అతనినేగాని చూచి 
Job 31:27  నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారితట్టు చూచి నా నోరు ముద్దుపెట్టినయెడలను పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవుదును. 
Job 31:28  అదియు న్యాయాధిపతులచేత శిక్ష నొందతగిన నేర మగును. 
Job 31:29  నన్ను ద్వేషించినవానికి కలిగిన నాశనమునుబట్టి నేను సంతోషించినయెడలను అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన యెడలను 
Job 31:30  నేనాలాగు చేయలేదు, అతని ప్రాణమును నేను శపించలేదు పాపముచేయుటకు నా నోటికి నేను చోటియ్యనే లేదు. 
Job 31:31  అతడు పెట్టిన భోజనము తిని, తృప్తి పొందనివానిని చూపింపగలవారెవరని నా గుడారమందు నివసించువారు పలుకనియెడలను 
Job 31:32  పరదేశిని వీధిలో ఉండనియ్యక నా యింటి వీధితలుపులు తెరచితిని గదా. 
Job 31:33  ఆదాము చేసినట్లు నా దోషములను దాచి పెట్టుకొని 
Job 31:34  మహా సమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగానుండి ద్వారము దాటి బయలు వెళ్లక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన యెడల పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవుదును 
Job 31:35  నా మనవి వినుటకై నాకొకడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను; ఇదిగో నా చేవ్రాలు గురుతు. ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు, సర్వశక్తుడు నాకుత్తరమిచ్చును గాక. 
Job 31:36  నిశ్చయముగా నేను నా భుజముమీద దానిని వేసి కొందును నాకు కిరీటముగా దానిని ధరించుకొందును. 
Job 31:37  నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసెదను, రాజు వలె నేనాయనయొద్దకు వెళ్లెదను. 
Job 31:38  నా భూమి నామీద మొఱ్ఱపెట్టినయెడలను దాని చాళ్లు ఏకమై యేడ్చినయెడల 
Job 31:39  క్రయధనము ఇయ్యక దాని ననుభవించినయెడలను దాని యజమానులకు ప్రాణహాని కలుగజేసిన యెడలను 
Job 31:40  గోధుమలకు ప్రతిగా ముళ్లును యవలకు ప్రతిగా కలుపును మొలచును గాక. యోబు వాక్యములు ఇంతటితో సమాప్తము లాయెను. 

No comments:

Post a Comment