Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, September 26, 2013

యోబు40

Job 40:1  మరియు యెహోవా యోబునకు ఈలాగు. .. ప్రత్యుత్తరమిచ్చెను 
Job 40:2  ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తర మియ్య వలెను. 
Job 40:3  అప్పుడు యోబు యెహోవాకు ఈలాగున ప్రత్యుత్తర మిచ్చెను 
Job 40:4  చిత్తగించుము, నేను నీచుడను, నేను, నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చెదను? నా నోటిమీద నా చేతిని ఉంచుకొందును. 
Job 40:5  ఒక మారు మాటలాడితిని నేను మరల నోరెత్తను. రెండు సారులు మాటలాడితిని ఇకను పలుకను. 
Job 40:6  అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి ఈలాగు యోబుతో ప్రత్యుత్తరమిచ్చెను 
Job 40:7  పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము నేను నీకు ప్రశ్నవేసెదను నీవు ప్రత్యుత్తరమిమ్ము. 
Job 40:8  నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసెదవా? నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నామీద అప రాధము మోపుదువా? 
Job 40:9  దేవునికి కలిగియున్న బాహుబలము నీకు కలదా? ఆయన ఉరుము ధ్వనివంటి స్వరముతో నీవు గర్జింప గలవా? 
Job 40:10  ఆడంబర మహాత్మ్యములతో నిన్ను నీవు అలంకరించు కొనుము గౌరవప్రభావములను ధరించుకొనుము. 
Job 40:11  నీ ఆగ్రహమును ప్రవాహములుగా కుమ్మరించుము గర్విష్టులైన వారినందరిని చూచి వారిని క్రుంగ జేయుము. 
Job 40:12  గర్విష్టులైన వారిని చూచి వారిని అణగగొట్టుము దుష్టులు ఎక్కడనున్నను వారిని అక్కడనే అణగ ద్రొక్కుము. 
Job 40:13  కనబడకుండ వారినందరిని బూడిదెలో పాతిపెట్టుము సమాధిలో వారిని బంధింపుము. 
Job 40:14  అప్పుడు నీ దక్షిణహస్తమే నిన్ను రక్షింపగలదని నేను నిన్నుగూర్చి ఒప్పుకొనెదను. 
Job 40:15  నేను చేసిన నీటిగుఱ్ఱమును నీవు చూచియున్నావు గదా ఎద్దువలె అది గడ్డి మేయును. 
Job 40:16  దాని శక్తి దాని నడుములో ఉన్నది దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది. 
Job 40:17  దేవదారుచెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను వంచును దాని తొడల నరములు దిట్టముగా సంధింపబడి యున్నవి. 
Job 40:18  దాని యెముకలు ఇత్తడి గొట్టములవలె ఉన్నవి దాని ప్రక్క టెముకలు ఇనుపకమ్ములవలె ఉన్నవి 
Job 40:19  అది దేవుడు సృష్టించినవాటిలో గొప్పది దాని సృజించినవాడే దాని ఖడ్గమును దానికిచ్చెను. 
Job 40:20  పర్వతములలో దానికి మేత మొలచును అరణ్యజంతువులన్నియు అచ్చట ఆడుకొనును. 
Job 40:21  తామర చెట్లక్రిందను జమ్ముగడ్డి మరుగునను పఱ్ఱలోను అది పండుకొనును 
Job 40:22  తామరచెట్ల నీడను అది ఆశ్రయించును నదిలోని నిరవంజిచెట్లు దాని చుట్టుకొనియుండును. 
Job 40:23  నదీప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు యొర్దానువంటి ప్రవాహము పొంగి దానినోటియొద్దకు వచ్చినను అది ధైర్యము విడువదు. 
Job 40:24  అది చూచుచుండగా ఎవరైన దానిని పట్టుకొనగలరా? ఉరియొగ్గి దాని ముక్కునకు సూత్రము వేయగలరా? 

No comments:

Post a Comment