Job 12:1 అప్పుడు యోబు ఈలాగు ప్రత్యుత్తర. .. మిచ్చెను
Job 12:2 నిజముగా లోకములో మీరే జనులుమీతోనే జ్ఞానము గతించి పోవును.
Job 12:3 అయినను మీకున్నట్టు నాకును వివేచనాశక్తి కలిగియున్నదినేను మీకంటె తక్కువజ్ఞానము కలవాడను కానుమీరు చెప్పినవాటిని ఎరుగనివాడెవడు?దేవునికి మొఱ్ఱపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైన నేను
Job 12:4 నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను. నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను.
Job 12:5 దుర్దశ నొందినవానిని తిరస్కరించుట క్షేమముగలవారు యుక్తమనుకొందురు. కాలుజారువారికొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది.
Job 12:6 దోపిడిగాండ్ర కాపురములు వర్థిల్లునుదేవునికి కోపము పుట్టించువారు నిర్భయముగానుందురువారు తమ బాహుబలమే తమకు దేవుడనుకొందురు.
Job 12:7 అయినను మృగములను విచారించుము అవి నీకు బోధించునుఆకాశపక్షులను విచారించుము అవి నీకు తెలియజేయును.
Job 12:8 భూమినిగూర్చి ధ్యానించినయెడల అది నీకు భోధించునుసముద్రములోని చేపలును నీకు దాని వివరించును
Job 12:9 వీటి అన్నిటినిబట్టి యోచించుకొనినయెడలయెహోవా హస్తము వీటిని కలుగజేసెనని తెలిసికొనలేనివాడెవడు?
Job 12:10 జీవరాసుల ప్రాణమును మనుష్యులందరి ఆత్మలును ఆయన వశమున నున్నవి గదా.
Job 12:11 అంగిలి ఆహారమును రుచి చూచునట్లుచెవి మాటలను పరీక్షింపదా?
Job 12:12 వృద్ధులయొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయువువలన వివేచన కలుగుచున్నది. అని మీరు చెప్పుదురు
Job 12:13 జ్ఞానశౌర్యములు ఆయనయొద్ద ఉన్నవిఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు.
Job 12:14 ఆలోచించుము ఆయన పడగొట్టగా ఎవరును మరలకట్టజాలరుఆయన మనుష్యుని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికిని సాధ్యము కాదు.
Job 12:15 ఆలోచించుము ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవునువాటిని ప్రవహింపనియ్యగా అవి భూమిని ముంచివేయును.
Job 12:16 బలమును జ్ఞానమును ఆయనకు స్వభావలక్షణములుమోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశ మున నున్నారు.
Job 12:17 ఆలోచనకర్తలను వస్త్రహీనులనుగా చేసి ఆయన వారిని తోడుకొని పోవును. న్యాయాధిపతులను అవివేకులనుగా కనుపరచును.
Job 12:18 రాజుల అధికారమును ఆయన కొట్టివేయునువారి నడుములకు గొలుసులు కట్టును.
Job 12:19 యాజకులను వస్త్రహీనులనుగాచేసి వారిని తోడుకొని పోవునుస్థిరముగా నాటుకొనినవారిని ఆయన పడగొట్టును.
Job 12:20 వాక్చాతుర్యము గలవారి పలుకును ఆయన నిరర్థకము చేయునుపెద్దలను బుద్ధిలేనివారినిగా చేయును.
Job 12:21 అధిపతులను ఆయన తిరస్కారము చేయును బలాఢ్యుల నడికట్లను విప్పును.
Job 12:22 చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచుమరణాంధకారమును వెలుగులోనికి రప్పించును
Job 12:23 జనములను విస్తరింపజేయును నిర్మూలముచేయునుసరిహద్దులను విశాలపరచును జనములను కొనిపోవును.
Job 12:24 భూజనుల అధిపతుల వివేచనను ఆయన నిరర్థక పరచునుత్రోవలేని మహారణ్యములో వారిని తిరుగులాడ చేయును.
Job 12:25 వారు వెలుగులేక చీకటిలో తడబడుచుందురుమత్తుగొనినవాడు తూలునట్లు ఆయన వారిని తూలచేయును.

No comments:
Post a Comment