Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, September 26, 2013

యోబు10

Job 10:1  నా బ్రదుకునందు నాకు విసుకు పుట్టినదినేను అడ్డులేకుండ అంగలార్చెదనునా మనోవ్యాకులము కొలది నేను పలికెదను 
Job 10:2  నా మీద నేరము మోపకుండుమునీవేల నాతో వ్యాజ్యెమాడుచున్నావో నాకు తెలియ జేయుమని నేను దేవునితో చెప్పెదను. 
Job 10:3  దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా? దుష్టుల ఆలోచనమీద దయా దృష్టియుంచుటసంతోషమా? నీ హస్తకృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా? 
Job 10:4  నీ నేత్రములు నరుల నేత్రములవంటివా? నరులు ఆలోచించునట్లు నీవు ఆలోచించు వాడవా? 
Job 10:5  నీ జీవితకాలము నరుల జీవిత కాలమువంటిదా? నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినములవంటివా? 
Job 10:6  నేను దోషిని కాననియునీ చేతిలోనుండి విడిపింపగలవాడెవడును లేడనియు నీవు ఎరిగియుండియు 
Job 10:7  నీవేల నా దోషమునుగూర్చి విచారణ చేయుచున్నావు? నా పాపమును ఏల వెదకుచున్నావు? 
Job 10:8  నీ హస్తములు నాకు అవయవ నిర్మాణముచేసి నన్ను రూపించి యున్ననునీవు నన్ను మింగివేయుచున్నావు. 
Job 10:9  జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసికొనుమునీవు నన్ను మరల మన్నుగా చేయుదువా? 
Job 10:10  ఒకడు పాలుపోసినట్లు నీవు నన్ను పోసితివిగదాజున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టితివి గదా. 
Job 10:11  చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివిఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి. 
Job 10:12  జీవము ననుగ్రహించి నాయెడల కృప చూపితివినీ సంరక్షణచేత నా ఆత్మను కాపాడితివి. 
Job 10:13  అయినను నా లోపములనుగూర్చి నీవు నీ హృదయ ములో ఆలోచించితివిఈ అభిప్రాయము నీకుండెనని నేనెరుగుదును. 
Job 10:14  నేను పాపము చేసినయెడల నీవు దాని కనిపెట్టుదువునా దోషమునకు పరిహారము చేయకుందువు. 
Job 10:15  నేను దోషకృత్యములు చేసినయెడల నాకు బాధకలుగునునేను నిర్దోషినై యుండినను అతిశయపడను అవమానముతో నిండుకొనినాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను. 
Job 10:16  ­నేను సంతోషించినయెడలఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నామీద చూపుదువు. 
Job 10:17  సింహము వేటాడునట్లు నీవు నన్ను వేటాడుచుందువుఎడతెగక నామీదికి క్రొత్త సాక్షులను పిలిచెదవుఎడతెగక నామీద నీ ఉగ్రతను పెంచెదవుఎడతెగక సమూహము వెనుక సమూహమును నా మీదికి రాజేసెదవు. 
Job 10:18  గర్భములోనుండి నీవు నన్నేల వెలికి రప్పించితివి? అప్పుడే యెవరును నన్ను చూడకుండ నేను ప్రాణము విడిచి యుండినయెడల మేలు; 
Job 10:19  అప్పుడు నేను లేనట్లే యుండియుందునుగర్భములోనుండి సమాధికి కొనిపోబడియుందును. 
Job 10:20  నా దినములు కొంచెమే గదాతిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు 
Job 10:21  అంధకారము మరణాంధకారముగల దేశమునకు 
Job 10:22  కటికచీకటియై గాఢాంధకారమయమైన దేశమునకుభ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకువెలుగే చీకటిగాగల దేశమునకు నేను వెళ్లక ముందుకొంతసేపు నేను తెప్పరిల్లునట్లునన్ను విడిచి నా జోలికి రాకుండుము. 

No comments:

Post a Comment