Job 22:1 అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఈలాగునప్రత్యుత్తరమిచ్చెను
Job 22:2 నరులు దేవునికి ప్రయోజనకారులగుదురా? కారు;బుద్ధిమంతులు తమమట్టుకు తామే ప్రయోజనకారులై యున్నారు
Job 22:3 నీవు నీతిమంతుడవై యుండుట సర్వశక్తుడగు దేవునికి సంతోషమా?నీవు యథార్థవంతుడవై ప్రవర్తించుట ఆయనకు లాభ కరమా?
Job 22:4 ఆయనయందు భయభక్తులు కలిగియున్నందున ఆయన నిన్ను గద్దించునా?నీ భయభక్తులనుబట్టి ఆయన నీతో వ్యాజ్యెమాడునా?
Job 22:5 నీ చెడుతనము గొప్పది కాదా?నీ దోషములు మితిలేనివి కావా?
Job 22:6 ఏమియు ఇయ్యకయే నీ సోదరులయొద్ద నీవు తాకట్టు పుచ్చుకొంటివివస్త్రహీనుల బట్టలను తీసికొంటివి
Job 22:7 దప్పిచేత ఆయాసపడినవారికి నీళ్లియ్యవైతివిఆకలిగొనినవానికి అన్నము పెట్టకపోతివి.
Job 22:8 బాహుబలముగల మనుష్యునికే భూమి ప్రాప్తించునుఘనుడని యెంచబడినవాడు దానిలో నివసించును.
Job 22:9 విధవరాండ్రను వట్టిచేతులతో పంపివేసితివితండ్రిలేనివారి చేతులు విరుగగొట్టితివి.
Job 22:10 కావుననే బోనులు నిన్ను చుట్టుకొనుచున్నవిఆకస్మిక భయము నిన్ను బెదరించుచున్నది.
Job 22:11 నిన్ను చిక్కించుకొన్న అంధకారమును నీవు చూచుట లేదా?నిన్ను ముంచబోవు ప్రళయజలములను నీవు చూచుట లేదా?
Job 22:12 దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా?నక్షత్రముల ఔన్నత్యమును చూడుము అవి ఎంతపైగా నున్నవి?
Job 22:13 దేవునికి ఏమి తెలియును?గాఢాంధకారములోనుండి ఆయన న్యాయము కనుగొనునా?
Job 22:14 గాఢమైన మేఘములు ఆయనకు చాటుగా నున్నవి, ఆయన చూడలేదుఆకాశములో ఆయన తిరుగుచున్నాడు అని నీవనుకొనుచున్నావు.
Job 22:15 పూర్వమునుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించెదవా?
Job 22:16 వారు అకాలముగా ఒక నిమిషములో నిర్మూలమైరివారి పునాదులు జలప్రవాహమువలె కొట్టుకొని పోయెను.
Job 22:17 ఆయన మంచి పదార్థములతో వారి యిండ్లను నింపినను
Job 22:18 మాయొద్దనుండి తొలగిపొమ్మనియుసర్వశక్తుడగు దేవుడు మాకు ఏమి చేయుననియు వారు దేవునితో అందురు. భక్తిహీనుల ఆలోచన నాకు దూరమై యుండునుగాక.
Job 22:19 మన విరోధులు నిశ్చయముగా నిర్మూలమైరనియువారి సంపదను అగ్ని కాల్చివేసెననియు పలుకుచు
Job 22:20 నీతిమంతులు దాని చూచి సంతోషించుదురునిర్దోషులు వారిని హేళనచేయుదురు.
Job 22:21 ఆయనతో సహవాసముచేసినయెడల నీకు సమాధానము కలుగునుఆలాగున నీకు మేలు కలుగును.
Job 22:22 ఆయన నోటి ఉపదేశమును అవలంబించుముఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము.
Job 22:23 సర్వశక్తునివైపు నీవు తిరిగినయెడలనీ గుడారములలోనుండి దుర్మార్గమును దూరముగాతొలగించినయెడల నీవు అభివృద్ధి పొందెదవు.
Job 22:24 మంటిలో నీ బంగారమును ఏటిరాళ్లలో ఓఫీరు సువర్ణ మును పారవేయుము
Job 22:25 అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును.
Job 22:26 అప్పుడు సర్వశక్తునియందు నీవు ఆనందించెదవుదేవునితట్టు నీ ముఖము ఎత్తెదవు.
Job 22:27 నీవు ఆయనకు ప్రార్థనచేయగాఆయన నీ మనవి నాలకించునునీ మ్రొక్కుబళ్లు నీవు చెల్లించెదవు.
Job 22:28 మరియు నీవు దేనినైన యోచనచేయగా అది నీకుస్థిరపరచబడునునీ మార్గములమీద వెలుగు ప్రకాశించును.
Job 22:29 నీవు పడద్రోయబడినప్పుడుమీదు చూచెదనందువువినయముగలవానిని ఆయన రక్షించును.
Job 22:30 నిర్దోషికానివానినైనను ఆయన విడిపించును. అతడు నీ చేతుల శుద్ధివలన విడిపింపబడును.

No comments:
Post a Comment